విశాఖపట్నంలో మహాకవి గురజాడ 157వ జయంతి

విశాఖపట్నంలో మహాకవి గురజాడ 157వ జయంతి సెప్టెంబర్‌ 21 ఉదయం ఆర్‌.టి.సి కాంప్లెక్స్‌ ప్రాంతంలోని గురజాడ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న సాహితీస్రవంతి, ఐద్వా విశాఖ నగర కమిటీల బృందం. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, సాహితీస్రవంతి అధ్యక్షులు ఎవి రమణారావు, కార్యదర్శి ఎన్‌.శ్రీనివాస్‌, ఐద్వా నాయకులు మాధవి, ఆర్‌.వరలక్ష్మి, కె.మణి, అరసం నాయకులు అనంతరావు, శ్యాంసుందర్‌, సమాజచైతన్య వేదిక నాయకులు రాంప్రభు, మూర్తి జె.వి.వి. నాయకులు చిలకామూర్తి, శివనాగేశ్వరరావు, యుటిఎఫ్‌ నాయకులు వై.ఆర్‌.కె ప్రసాద్‌, ప్రజానాట్యమండలి కార్యదర్శి జి.రమణ తదితరులు పాల్గొన్నారు. గురజాడ రచించిన దేశభక్తి గేయాన్ని ఆహూతులందరూ ఏకకంఠంతో ఆలపించారు.