అనంతపురంలో శుక సప్తతి కథలు ఆవిష్కరణ, విజయనగరంలో మాతృబాష సభ

పిళ్లా విజయ్‌ రచించిన శుక సప్తతి కథలు పుస్తకాన్ని సెప్టెంబర్‌ 25న కదిరి అభివద్ధి వేదిక  ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కదిరిలోని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో ఆవిష్కరించారు. చిత్రంలో పిళ్ళా విజయ్‌, కె. వి. రమణ, నందవరం కేశవరెడ్డి,  వెంట్రామిరెడ్డి తదితరులు. కవులు భోగినేని మునీంద్ర, శంకర్‌ నారాయణ రాజు, రఫీ, కదిరి అభివద్ధి వేదిక నాయకులు రియాజుల్లా, యన్‌ ఆర్‌ శ్రీనివాసులు, యాకోబ్‌ ఖాన్‌, రచయిత ఆదినారాయణ, లాయర్‌ నాగేంద్రతదితరులు పాల్గొన్నారు.

 

 

విజయనగరంలో గురజాడ స్వగృహంలో సెప్టెంబర్‌ 22న వివిధ సాహిత్య, సాంస్క ృతిక సంస్థల ఆధ్వర్యంలో 'హిందీని రుద్దవద్దు.. మాతృభాషే ముద్దు' అంశంపై జరిగిన సభలో ప్రసంగిస్తున్న ప్రముఖ రచయిత అట్టాడ అప్పల్నాయుడు. చిత్రంలో గంటేడ గౌరునాయుడు, డా|| డి.వి.జి. శంకరరావు, ద్వారం దుర్గాప్రసాద్‌ ఉన్నారు.