నీళ్ళగోస కవితా సంకలనం

వర్తమాన ప్రపంచం అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే.  వాటిలో అతిముఖ్యమైన నీటి సమస్యను తీసుకుని తెలుగులో లబ్ధ ప్రతిష్టులైన కవుల దగ్గర్నుంచి ఔత్సాహిక కవుల వరకూ రాసిన కవితల సమాహారమే ఈ 'నీళ్ళగోస' కవితా సంకలనం. నేటినిజం పత్రిక సంపాదకులు బైస దేవదాసు సంపాదకత్వం వహించిన ఈ పుస్తకంలోని కవితలు నీళ్ళ సమస్య తీవ్రతను అనేక కోణాల్లో ఆవిష్కరించాయి. ఇది ఒక మంచి ప్రయత్నం.

సంపాదకుడు: బైస దేవదాసు
వెల: 
రూ 150
పేజీలు: 
104
ప్రతులకు: 
040-27662477