పాలకొల్లులో అక్టోబర్ 5న జాషువా జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలో శాసనమండలి సభ్యులు ఐ. వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యుటిఎఫ్, జనవిజ్ఞాన వేదిక, సాహితీస్రవంతి సంయుక్తంగా నిర్వహించిన ఈ సభలో సాహితీస్రవంతి పాలొకల్లు కన్వీనర్ వి. శ్రీరామమూర్తి, ఎ.కె.యు. రామభద్ర, మంచెం వెంకటేశ్వర్లు, శ్రీనివాసన్, కె. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అవినీతి వ్యతిరేక కవితల పోటీ
''అమరావతి సాహితీమిత్రులు'', ''సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్'' సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ''అవినీతి వ్యతిరేక కవితల పోటీ'' నిర్వహిస్తున్నట్లు సంస్థల సంస్థాపకులు డా. రావి రంగారావు, డాక్టర్ టి. సేవకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 20 పాదాలకు మించని పద్య కవిత/వచన కవిత/గేయం ఏదైనా ఒక కవిత మాత్రమే పంపించవలసి వుంటుంది. ప్రథమ బహుమతి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు,
తతీయ బహుమతి రూ.2 వేలు, నాలుగు ప్రత్యేక బహుమతులు రూ.500 చొప్పున ఇవ్వబడతాయి. ''ఈ పోటీకి ప్రత్యేకంగా సొంతంగా రాసిన కవిత'' అని హామీ పత్రం కవిత వెనక వైపు రాసి చిరునామా, ఫోన్ నంబరు కూడా ఇచ్చి సంతకం చేయాలి. డిసెంబర్ 9 సోమవారం ఉదయం 10 గం.కు గుంటూరు 2/1 బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో జరిగే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ సభలో బహుమతులు అందించటం జరుగుతుంది. కవితల్ని నవంబర్ 20లోపు అందేలా ''డా. రావి రంగారావు, 101, శంఖచక్ర నివాస్, అన్నపూర్ణ నగర్, 5వ లైను తూర్పు, గోరంట్ల, గుంటూరు 522034'' అడ్రసుకు పంపవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు9247581825 ద్వారా సంప్రదించవచ్చును.
పుస్తక సంపుటాల పోటీకి ఆహ్వానం
సజనసాహితి వారి శ్రీ శివేగారి దేవమ్మ స్మారక జాతీయ పురస్కారం - 2019 కోసం నవల, కథా, కవితా, వ్యాసాల సంపుటాలను పంపవలసిందిగా శివేగారి చిన్నికృష్ణ ఒక ప్రకటనలో కోరారు. ఉత్తమ నవల 5000/-, ఉత్తమ కథా సంపుటి 4000/-, ఉత్తమ వ్యాసాల సంపుటి 3000/,
ఉత్తమ కవితా సంపుటి 3000/-, ఉత్తమ లఘుకవితా సంపుటి 2000/- నగదు పురస్కారం అందివ్వనున్నట్లు తెలిపారు. పుస్తకాలు చేరవలసిన చివరి తేదీ డిసెంబర్ 31. పుస్తకాలు పంపవలసిన చిరునామా: శివేగారి చిన్నిక ష్ణ, కాలువపల్లి (గ్రామం), ఇంటి నంబరు 1-76, వీ.ూ కొటూరు (పోస్ట్), పలమనేరు (మండలం), చిత్తూరు జిల్లా, పిన్‌కోడ్: 517408, ఇతర వివరాలకు 6300318230 ద్వారా సంప్రదించవచ్చును.