విశ్వనరుడు గుర్రం జాషువా, షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో రచయితలు సామాజిక స్పహ కలిగిన రచనలు చేయాలని డాక్టర్ కె.నాగేశ్వరాచారి పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న జరిగిన జాషువా 124 వ జయంతి మరియు భగత్ సింగ్ 112 వ జయంతి సభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అసమానతలు, దోపిడీ, వివక్ష లేని సమాజాన్ని ఇద్దరూ కాంక్షించారని, వారిద్దరి కలలు నేటికీ సంపూర్ణం కాలేదని నాగేశ్వరాచారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహానుభావులు కలలు గన్న సమాజాన్ని నెలకొల్పేందుకు రచయితలు తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. సభకు సాహితీ స్రవంతి జిల్లా నాయకులు ప్రజ్ఞా సురేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు జాషువా, భగత్ సింగ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతినెలా జరిగే సాహితీ సంగమం లో భాగంగా కథా సంగమం కార్యక్రమం నిర్వహించారు. ఉప్పరపాటి వెంకటేశులు, యాములపల్లి నర్సిరెడ్డి, ప్రగతి, హేమ మాలిని, జూటూరు తులసీదాస్ తదితరులు కథలు వినిపించారు. డాక్టర్ నాగేశ్వరాచారి కథలను సమీక్షించి, సూచనలు చేశారు. క్లుప్తత కథకు అత్యంత కీలకమన్నారు. వస్తువులో కొత్త దనం, చదివించే శైలి ఉన్న కథలు మంచి రచనలుగా నిలిచిపోతాయని అన్నారు. హేమ మాలిని కథ ఉత్తమ కథగా ఎంపికయింది. బాలభారతీ మేడమ్ బహుమతి తాలూకు నగదు అందించారు. ఈ కార్యక్రమంలో యాడికి సూర్యనారాయణ రెడ్డి, రియాజుద్దీన్, డాక్టర్ ఎ.ఎ.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాహితి మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో ఆర్టీసి కార్మికుల సమ్మెకు మద్దతు
తెలంగాణ సాహితి మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్టీసి కార్మికుల సమ్మెకు మద్దతుగా అక్టోబర్ 17న వాగ్దేవి జూనియర్ కళాశాల హాలులో కవిసమ్మేళనం జరిగింది. తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు వల్లబాపురం జనార్దన అద్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, రామక ష్ణా రావు, టిఎన్‌జివో జిల్లా అద్యక్షులు, నందిగామ కిశోర్ కుమార్, తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షులు, ఎండి.ఖాజామైనద్దీన్, తెలంగాణ సాహితి జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు