స్వాతంత్య్ర సమర యోధుడు,నిష్కళంక దేశభక్తుడు, శ్రీకాకుళం జిల్లాముద్దుబిడ్డ గరిమెళ్ళ సత్యనారాయణ సంస్మరణోత్సవం నిర్వహించాలని గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం నిర్ణయించిందని కేంద్రం అధ్యక్షులు వి.జి.కె.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణకోసంగాను, జిల్లాలోని నలభైకి పైగా సాహితీ సాంస్క తిక సంస్థలను భాగస్వాములను చేస్తూ ఒక ఆహ్వాన సంఘం ఏర్పడిందని తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ,కథానిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు గౌరవాధ్యక్షులుగా, కేంద్రసాహిత్య అకాడమీ తెలుగు విభాగం సలహాసంఘ సభ్యులు, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు అధ్యక్షులుగాను, వి.జి.కె.మూర్తి కార్యదర్శి గాను వ్యవహరిస్తారు. వివిధ సంఘాలనుండి నలభయి మందికి పైగా గౌరవసభ్యులు వున్నారు. డిసెంబరు 22 ఆదివారం నాడు జరిగే ఈ కార్యక్రమం సందర్బంగా జిల్లాలోని యువతీ యువకులకు స్వాతంత్య్రోద్యమం పట్ల అవగాహన కలిగించేందుకు, క్విజ్, వ్యాసరచన, వక్త త్వం అంశాల్లో పోటీలు జరుగుతాయని, ఔత్సాహిక రచయితలనుండి, కవితలను ఆహ్వానించి, ఎంపిక చేయబడ్డ వాటితో ఒక సంపుటి తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ''నాటి స్వాతంత్య్రోద్యమం నేటి సామాజిక స్థితిగతులు'' అనే ఇతివ త్తం తో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు.