సాహిత్య సజనకారులకు ఇస్తున్న విమలాశాంతి సాహిత్య పురస్కారాన్ని న్యాయనిర్ణేతల ఏకగ్రీవ నిర్ణయం ప్రకారం సుప్రసిద్ధ కవి, కథారచయిత అద్దేపల్లి ప్రభు వెలువరించిన ''సీ మేన్ '' కథాసంపుటికి ప్రకటిస్తున్నట్లు విమలాశాంతి సాహిత్య పురస్కారం ట్రస్ట్ ఛైర్మన్ శాంతినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి రజనీకాంత్ స్మారక కథాపురస్కారంగా ఇచ్చే ఈ పురస్కారంతో పాటు రచయితకు రు 10000/లు నగదు నందించి, డిసెంబర్ నెలలో జరిగే ఒక సాహిత్యసభలో రచయితను సత్కరిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు.