ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు - 2019

32వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు - 2019 కోసం కవులు తమ కవితా సంపుటాలను పంపవలసిందిగా అవార్డు వ్యవస్థాపకులు డా|| ఉమ్మడిశెట్టి రాధేయ ఒక ప్రకటనలో కోరారు. ఈ అవార్డు కోసం 2019లో ప్రచురించబడిన కవితా సంపుటాలు మాత్రమే పంపాలి. ఎంపికయిన ఉత్తమ కవితా సంపుటికి ఐదువేల రూపాయల నగదు బహుమతి అందజేయబడుతుందని తెలిపారు. జనవరి 30 వ తేదిలోపు 4 ప్రతులను డా|| ఉమ్మడిశెట్టి రాధేయ, ఛైర్మన్‌ ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్‌, 31-1-606-1, షిర్డినగర్‌, రెవిన్యూ కాలనీ, అనంతపురం- 515001. ఇతర వివరాలకు 9985171411 ద్వారా సంప్రదించవచ్చును.