ఎదారి బతుకులు పల్లెకతలు

భారతి కథలు అభివృద్ధి చెందుతున్న భారతదేశపు క్రీనీడలను చూపించిన కాగడాలు. పాతికకు పైనున్న ఈ కథల్లో ఆమె చిన్నతనపు రోజుల మొదలు, నోట్ల రద్దు, పల్లెలపై కూడా టీవీల ప్రభావం వరకూ ఒక పరిణామ క్రమం వున్నది. మారీమారని పల్లెబ్రతుకు వెతలున్నాయి. తన అమ్మనుడిలోనే కథ చెబుతూ చివర్లో కొన్ని జీవితసత్యాలను అలవోకగా మన మీదకి విసురుతుంది చాలా ఒడుపుగా. నగర మధ్యతరగతి భద్రజీవుల కథలు కావివి. కులం రీత్యా వర్గం రీత్యా సమాజపు అంచులలోనుంచీ ఇంకా నడిమధ్యకు రావడానికి పెనుగులాడుతున్న జనం వెతలు

-  పి. సత్యవతి

ఎండపల్లి భారతి
వెల: 
రూ 100
పేజీలు: 
120
ప్రతులకు: 
040-23521849