మొలక కవిత్వం

ఆమె కవితా ప్రపంచంలో పువ్వులు, పిల్లలు, భవిష్యత్తుపై ఆశ, ప్రకృతిపై ప్రేమ, సమస్త పీడిత జనసందోహాల పోరాటపటిమ గురించిన విశ్వాసం ఇవన్నీ చోటుచేసుకున్నాయి. వస్తులోపం దృష్టికోణలోపం, కవిత్వీకరణ లోపంలేని అచ్చమైన కవితలు కొలువుదీరాయి ఈ సంకలనంలో. భానుశ్రీ కవిత్వాన్నంతా చదివిన తర్వాత చాలా ఆశ, నమ్మకం కలుగుతున్నాయి. స్పందించే హృదయాలు, కన్నీరుకార్చేకళ్ళు, చేయందించే మానవులు ఉంటారనీ, ఈ కర్కశ సమాజంలో పీడితులకు ఊరటనిచ్చి, పోరాడమని పిలుపునిచ్చే గొంతులు ఉన్నాయని మరొకసారి తెలుస్తుంది.

- ఓల్గా

భానుశ్రీ కొత్వాల్‌
వెల: 
రూ 90
పేజీలు: 
90
ప్రతులకు: 
9866863913