జనవరి 18 న కాకినాడ రోటరీ సమావేశ మందిరంలో పుప్పాల ఫౌండేషన్ వారి 5వ సాహితీ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ సభలో పుప్పాల సూర్యకుమారి రాసిన ''శ్రీమతి కన్య'' నవలను స్థానిక ఎమ్.ఎల్.ఎ. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆవిష్కరించారు. ప్రముఖ కవి, రచయిత, చిత్రకారులు, ప్రయోక్త మాకినీడి సూర్యభాస్కర్ సభకి అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీ సమీక్షకులు శ్రీమతి డా|| కె. శైలజ ప్రముఖ కవి డా|| ర్యాలి ప్రసాద్ 'శ్రీమతి కన్య' నవలను సమీక్షించారు. ఆత్మీయ అతిథులుగా శ్రీమతి ధూళిపూడి రమాదేవి, డిప్యూటీ కలెక్టర్, విజయవాడ మరియు డా|| ఆర్. అమరేంద్ర కుమార్, గుడా వైస్ ఛైర్మన్, నవ మల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ, విజయవాడ, సంస్థ ఉపాధ్యక్షులు ఉంగరాల వెంకటేశ్వరరావు, బాజిబోయిన వెంకటేష్ నాయుడు, శ్రీమతి ఉద్గళా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సభకు రచయితలు కాకరపర్తి దుర్గాప్రసాద్ స్వాగతం పలకగా ఉండవిల్లి వందన సమర్పణ గావించారు. శ్రీమతి సూర్యకుమారి అధ్యక్షులుగా వున్న సూర్య సాహితి మరియు పుప్పాల ఫౌండేషన్ 5 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ కథకులు కె.వి. కృష్ణ 'మమతల పందిరి' కథాసంపుటికి, ప్రముఖ కవి ర్యాలి ప్రసాద్ 'గాంధీ' దీర్ఘ కవితాసంపుటికి, పత్రికారంగం లో అనేక సంవత్సరాలుగా విశేష సేవలందిస్తున్న ప్రముఖ మాసపత్రిక నవ మల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీకి పురస్కారాలందించారు. కవిత్వం, కథల పోటీలు నిర్వహించి అయిదుగురు ఉత్తమ కథకులకు, అయిదుగురు ఉత్తమ కవులకు పురస్కారాలు అందజేసారు. ఉత్తమ కథకులుగా సిహెచ్. సింహప్రసాద్, హైదరాబాదు, పాణ్యం దత్తశర్మ, హైదరాబాదు, ఆర్.సి. కృష్ణస్వామి రాజు, తిరుపతి, శ్రీమతి రావుల కిరణ్మయి, వరంగల్, శ్రీమతి నామని సుజనాదేవి, వరంగల్. ఉత్తమ కవిత, విజేతలు: మాడిశెట్టి శ్రీనివాస్, ధర్మపురి, మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ, చొక్కెర తాతారావు, విశాఖపట్నం, పొత్తూరి సీతారామరాజు, కాకినాడ, చొక్కాపు లకీëనాయుడు, విజయనగరం, బహుమతులు, సత్కారాలు అందు కున్నారు. కథలకు, న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ రచయితలు శ్రీకంఠస్ఫూర్తి, దాట్ల దేవదానం రాజు వ్యవహరించారు. కవితలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ కవులు మాకినీడి సూర్యభాస్కర్, బొల్లోజు బాబా వ్యవహరించారు. పుప్పాల సత్యనారాయణ సభా నిర్వహణ చూసారు.