కొత్తగా రాస్తున్న కథకులు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం మొగ్గల్జడ అని సాహితీ స్రవంతి జిల్లా గౌరవాధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి అన్నారు. నెలనెలా సాహితీ సంగమం కార్యక్రమం లో భాగంగా శనివారం సాయంత్రం అనంతపుంరలోని ఆర్ట్స్ కళాశాల లో జరిగిన కథా సంగమం కార్యక్రమం లో ఆయన పాల్గొని డాక్టర్ బాలగొండ ఆంజనేయులు గారి మొగ్గల్జడ పుస్తకాన్ని సమీక్షించారు. కథకు క్లుప్తత ఉండాలని, శిల్పం ముఖ్యమని అన్నారు. అనంతరం ఎల్.ఆర్.వెంకట రమణ, జి.ఎల్.ఎన్.ప్రసాద్, అశ్వర్థ రెడ్డి, శోభామణి, శేషగిరి రాయుడు, స్వర్ణ తదితరులు కథలు చదివి వినిపించారు. సీనియర్ రచయిత డాక్టర్ బాలగొండ ఆంజనేయులు వర్ధమాన కథకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షురాలు ప్రగతి, డాక్టర్ రాధేయ, సూర్య నారాయణ రెడ్డి, మేఘన పాల్గొన్నారు. ఉత్తమ కథకు బహుమతి అందజేశారు.