తెలుగు చిన్న కథలను ప్రోత్సహించాలని గత 11 సంవత్సరాలుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు సోమేపల్లి కుటుంబం తరపున సోమేపల్లి వెంకటసుబ్బయ్య, చలపాక ప్రకాశ్ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. 12వ సోమేపల్లి పురస్కారం కోసం రచయితలు చిన్న కథలను పోటీలకు పంపించవలసిందిగా కోరారు. అత్యుత్తమ కథకు రూ.2500/-, ఉత్తమ కథకు రూ.1500/-, మంచి కథకు రూ.1000/-, ప్రత్యేక బహుమతులు రూ.500/-చొప్పున ఇద్దరికి అందించనున్నుట్లు తెలిపారు. కథలను మార్చి 10వ తేదీలోపు రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్.కాంప్లెక్స్, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001 అనే చిరునామాకు పంవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు 9247475975 ద్వారా సంప్రదించవచ్చును.