విరసం కార్యదర్శి కాశీం అరెస్ట్‌ అప్రజాస్వామికం

విప్లవ రచయితల సంఘం కార్యదర్శి సి.కాశీం అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సాహితీస్రవంతి గౌరవ అధ్యక్షులు తెలకపల్లి రవి, అధ్యక్షులు వొరప్రసాద్‌ తెలిపారు. జనవరి 18 తెల్లవారు జామున కాశీం ఇంటిని ముట్టడించిన పోలీసులు 2016లో నమోదయిన కేసుకు సంబంధించి అరెస్ట్‌ చేసినట్లు చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది. సరైన ఆధారాలు చూపకుండా దౌర్జన్యకర పద్ధతులలో పోలీసులు వ్యవహరించడాన్ని ప్రజాస్వామికవాదులు, వివిధ ప్రజాసంఘాలు పెద్దయెత్తున ఖండించాయి. ఉస్మానియా యూనివర్శిటీ ఆచార్యులుగా పనిచేస్తున్న కాశీం కవి, రచయిత. ఇటీవలనే జనవరి 11, 12 తేదీలలో హైదరాబాద్‌లో జరిగిన విరసం 50 ఏళ్ళ మహాసభలలో నూతన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వారం రోజులు కూడా గడవకుండానే కాశీంను అరెస్ట్‌ చేసారు. కాశీంను బేషరతుగా విడుదల చేయాల్సిందిగా సాహితీస్రవంతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.