సమన్విత, కోవూరి ఛారిటబుల్ ట్రస్టు సంయుక్తంగా 2019 సంవత్సరంలో 'ట్రాన్స్‌జండర్' వ్యక్తుల జీవితాలలోని సమస్యలు, పరిష్కారాలు అంశంపై ఆహ్వానించిన కథల పోటీల ఫలితాలను డాక్టర్ డి. శమంతకమణి, కోపూరి పుష్పాదేవి ఒక ప్రకటనలో తెలియజేశారు. మొదటి బహుమతి పి.వి.ఆర్. శివకుమార్ రాసిన 'కసారా నుండి రైలు', రెండవ బహుమతి డా. రమణ యశస్వి రాసిన 'తోటమాలి చమత్కారం, మూడవ బహుమతి కోయిలాడ రామ్మోహనరావు రాసిన 'మానవత్వం' కథలకు లభించాయి. మరో 12 కథలకు కన్సోలేషన్ బహుమతి ప్రకటించారు. కన్సోలేషన్ బహుమతులు పొందినవారు: పన్నాల సాయిశ్రీ పద్మశ్రీ - 'రంగుటద్దం', ముసునూరు నారాయణ- 'ప్రేమ బృందావనం', అనుసూరి వెంకటేశ్వరరావు - 'మీతో మేము', ఆవుల వెంకటేశులు - 'చీకటి జాబిలి', దినవహి సత్యవతి - 'కొత్త చిగుర్లు', కె. తాయారమ్మ - ఏది పాపం... ఏది పుణ్యం', ఎ. సరళ - వైఖరిలో మార్పు రావాలి', వంజరి రోహిణి - 'విజేత', వురిమళ్ళ సునంద - 'మాకూ మనసుంది', తాటికోల పద్మావతి - 'కొత్తదారి', కుంచనపల్లి శ్రీలక్ష్మి - 'వికసిత కుసుమం', చొక్కర తాతారావు- 'పంజరం'. మార్చి 28వ తేదిన విజయవాడలోని ఎం.బి. విజ్ఞానకేంద్రంలో జరగబోయే సభలో 15 కథలతో పుస్తకావిష్కరణ జరగనుందని తెలిపారు.