పి. సత్యవతికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం

ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి కేంద్ర సాహిత్య అకాడమీ 2019 అనువాద పురస్కారం లభించింది. జనవరి 1, 2013 నుంచి డిసెంబరు 2017 మధ్యకాలానికి చెందిన అనువాద పుస్తకాల్లో వివిధ భాషలకు చెందిన 23 మంది రచయితలను కేంద్ర సాహిత్య అకాడమీ 2019 అనువాద అవార్డుకు ఎంపిక చేసినట్లు అకాడమీ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. తమిళనాడుకు చెందిన ఎ. రేవతి రచించిన 'ద ట్రూత్‌ ఎబౌట్‌ మి: ఏ హిజ్రా లైఫ్‌ స్టోరీ'ని సత్యవతి 'ఓ హిజ్రా ఆత్మకథ' గా తెలుగులోకి అనువదించారు. పి. సత్యవతి విజయవాడలోని ఎస్‌.ఎ.ఎస్‌. కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసి రిటైరయ్యారు. పలు కథా సంపుటాలు వెలువరించారు. 'పి. సత్యవతి కథలు' పేరిట విశాలాంధ్ర ప్రచురణాలయం వీరి కథలు ప్రచురించింది. ఈ పురస్కారాన్ని ఎంపిక చేసిన న్యాయనిర్ణేతల బృందంలో శాంతాసుందరి, స్వాతిశ్రీపాద, డా|| వెన్నా వల్లభరావు ఉన్నారు. ఈ పుస్తకాన్ని తెలుగు నుండి

ఉత్తమ్‌ చంద్ర బ్రహ్మ ఇంగ్లీషులోకి అనువదించారు. ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అవార్డు - 2019 అందుకోనున్నారు. విజేతలకు రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేస్తారు.