పెన్నా రచయితల సంఘం గత 10 సంవత్సరాల నుండి కవితా సంపుటాలకు, కథాసంపుటాలకు సాహితీ అవార్డును అందజేయడం జరుగుతుందని పెన్నా రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోపూరు పెంచల నరసింహం, అవ్వారు శ్రీధర్ బాబు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. 2020 పెరసం అవార్డు నిమిత్తం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 2019 జనవరి నుండి 2019 డిసెంబర్ మధ్య ప్రచురితమైన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపిక అయిన కవికి పెన్నా రచయితల సంఘం 11 వ వార్షికోత్సవంలో సత్కరించి, నగదు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. మార్చి 31 లోపు నాలుగు పుస్తకాలను ఈ క్రింది అడ్రస్ కు పంపించవలసినదిగా కోరారు. శ్రీధర్ బాబు, 23 - 1- 57, పెండెం వారి వీధీ, ఫత్తేఖాన్ పేట, నెల్లూరు - 524003. ఇతర వివరాలకు 8500130770, 9346393501 ద్వారా సంప్రదించవచ్చును.