లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం
విజయవాడలోని ఎం.బి. విజ్ఞానకేంద్రంలో సాహితీస్రవంతి, ఎం.బి. విజ్ఞానకేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 15న మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం ఆడిటోరియంలో 'భారత కవనం - లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం' పేరిట సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ సమాజం, రాజ్యాంగం, రచయితలు వంటి అంశాలపై సదస్సులు జరుగుతాయి. ఈ సదస్సులలో ప్రముఖ రచయితలు, మేధావులు, విద్యావేత్తలు పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ జరిగే సదస్సులో జనకవనం ఉంటుంది. ఈ జనకవనంలో ప్రముఖ కవులతో పాటు ఔత్సాహిక కవులూ పాల్గొని తమ స్వీయ కవితలు చదవడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు పెద్దయెత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జనకవనంలో పాల్గొనే కవులు తమ పేర్లను నమోదు చేసుకోవలసిందిగా కోరుతున్నాం. వివరాలకు వొరప్రసాద్ - 9490099059, సత్యరంజన్ - 8341951645, కె. లక్ష్మయ్య - 9490099057 సంప్రదించగలరు.