దసరా కథల పోటీ

దసరా సందర్భంగా పాలపిట్ట-జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో - దసరా కథల పోటీ- నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి- రూ. 10,000, రెండో బహుమతి- రూ. 5000, మూడో బహుమతి- 3000. ఒక్కొక్క కథకు వెయ్యి రూపాయల చొప్పున పది కథలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. కథలకు పేజీల నిడివి లేదు. ఎన్ని పేజీలయినా, ఎన్ని పదాలయినా ఉండొచ్చు. ఇతివత్తం రచయితల యిష్టం. ఎలాంటి షరతులు లేవు. కథ కథగా ఉండటమే ప్రధానం. తెలుగు కథకులు ఎక్కడి వారయినా ఈ పోటీలో పాల్గొనవచ్చు అని ఆ ప్రకటనలో తెలిపారు. కథలు పంపడానికి చివరి తేదీ 15 ఆగస్టు 2020. కథలను ఈమెయిల్‌లోనూ, పోస్టులోనూ పంపవచ్చు. చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌-500 036. ఇతర వివరాలకు 9848787284 ద్వారా సంప్రదించవచ్చును. ఈ మెయిల్స్‌:[email protected][email protected]