ప్రముఖ కవి, రచయిత రావి రంగారావు మినీ కవిత్వాన్ని విస్తృతం గా వెలువరించటమే కాదు; పద్య ప్రక్రియలోనూ కృషి చేశారు. ఆ పద్యాల్లోని చెట్ల సంబంధ ప్రస్తావనను వివరించిన చిన్ని పుస్తకం ఇది. రావి వారికీ, చెట్టుకూ ఉన్న అవినాభావ బంధాన్ని వివరించే పని ఈ పుస్తకంలో రచయిత చేశారు. 1979లో ముద్రించిన రంగారావు గారి పద్యసంపుటి 'అమృతవృక్షము.' దానినే 41 శీర్షికలతో 2005లో 'అమృతం చెట్టు' పేరిట విస్తరించి, పునర్ముద్రించారు.
డా. రామమడుగు వేంకటేశ్వర శర్మ
వెల:
రూ 50
పేజీలు:
60
ప్రతులకు:
92475 81825