రెబెల్‌ నవల

అనగనగా ఒక ఊరు. చాలా చిన్న ఊరు. ఆ ఊరి పేరు గడివేముల. అది 1961. ఒక పిల్లవాడు అప్పటికి పదేళ్ల వాడు. కొండమీద బొల్లవరంలో మేనమామల ఇంట్లో వుంటూ గడివేముల మీదుగా చదువుకు వెళ్లి వచ్చేవాడు. పెద్ద వాడయ్యాక వాడి జీవితం చాలా రఫ్‌గా గడిచింది. కాలేజీ చదువుల కోసం ఊరూరు తిరిగాడు. నానా గడ్డి తిన్నాడు. నగ్జలైట్‌ పార్టీలో మరీ రఫ్‌గా బతికాడు.
ఆ పిల్లవాడి పేరు పవన్‌ కుమార్‌. తనను నేను అమెరికాలో పెన్నింగ్‌టన్‌ అనే ఊరిలో కలిశాను. అక్కడికి మా అబ్బాయి విజిటర్‌గా వెళ్లి కొన్నాళ్లున్నా నేను. నాకు ఎవరినైనా పలకరించి కబుర్లు చెప్పుకోవాలని అనిపించింది. తాను ఎవరు ఎక్కడివాడు ఏం చేశాడు ఏమేం చేశాడు.. అడిగాను. అతడి కథ బాగుంది. సంఘటనాత్మకంగా వుంది. తన కథ వినేకొద్ది వాస్తవాలు కల్పన కన్నా విచిత్రంగావుండటం అంటే ఏమిటో నాకు తెలిసి వచ్చింది. కథ నాకు చాలా ఆసక్తికరం అనిపించింది. మీకు చెబుతున్నాను. ఇది అతడి కథ. కుంచెం 'హిస్టరీ' కూడా.
- హెచ్చార్కె (తొలి రెండు అధ్యాయాలలోని వాక్యాలు కొన్ని)

హెచ్చార్కె
వెల: 
రూ 150
ప్రతులకు: 
7093800678