జవాబు కావాలి కవిత్వం

గుంటూరు జిల్లాలో పుట్టిన సలీమ ఇప్పుడు హైదరాబాదులో నవ తెలంగాణా పత్రికలో పనిచేస్తోంది. 2009 నుంచి కవిత్వం రాస్తోంది. భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళల పాత్ర అన్న అంశంపై నాగార్జున యూనివర్సిటీలో పరిశోధన చేస్తోంది. ప్రశ్నించటమే జ్ఞానాన్ని పెంచుతుందని, జవాబులు అప్పుడే దొరకుతాయని బలంగా నమ్మే వ్యక్తి. అందుకే ఈ పుస్తకానికి 'జవాబు కావాలి' అని పేరు పెట్టి సమాజాన్ని నిలదీస్తోంది. ఇది సలీమ తొలి కవితా సంపుటి.
- శిలాలోలిత

సలీమ
వెల: 
రూ 120
పేజీలు: 
112