ఆదిలాబాద్ జిల్లా 'ఆవడం'కు చెందిన తోకల రాజేశం కవిత 'అక్షరం'కు 2012 సంవత్సరానికి గాను ఎక్స్‌రే అవార్డు లభించింది. ఈ ప్రధాన అవార్డుతో పాటు మరో పదిమందికి ఉత్తమ కవితా పురస్కారాలను ఎక్స్‌రే పత్రిక సంపాదకులు కొల్లూరి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉత్తమ కవితా పురాస్కారాలు పొందినవారు వరుసగా ''మరొకపాఠం'' కె. విల్సన్‌రావు, (హైదరాబాదు) ''ఆకుపచ్చ జ్ఞాపకం'' సరికొండ నరసింహరాజు, (జగ్గయ్యపేట) ''మట్టి నాక్కావాలి'' చొక్కర తాతారావు, (విశాఖపట్నం), ''అదిగో-అక్కడ గూడు చెదిరిపోతోంది'' తేళ్ళపురి సుధీర్‌కుమార్ (కోవలె కుంట్ల కర్నూలు) ''కలలు కననివ్వండి''. డా|| కె.బి. డేవిడ్ లివింగ్‌స్టన్ (మార్కాపురం) ''గాయపడ్డ గులాబి కోసం'' గరిమళ్ళ నాగేశ్వరరావు (విశాఖపట్నం) ''సంతకం ఓ ప్రభంజనం'' పి.వి. సుబ్బారావు (హైదరాబాదు) ''అంతిమ స్పర్శ'' ఎరుకలపూడి గోపినాధరావు (విజయవాడ) ''తాడిచెట్టుని మాట్లాడుతున్నా...'' రాపాక సన్ని విజయకృష్ణ (విశాఖపట్నం) ''మాయా బజార్'' పెళ్లూరు సునీల్ (కోట, నెల్లూరు) ఈ అవార్డుకు 400 కవితలు వచ్చాయని, సీనియర్ సాహితీవేత్త డా|| ఏటుకూరి ప్రసాద్ ఈ ఎంపికకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారని తెలిపారు.