ప్రకాశం జిల్లా రచయితల సంఘం - ఒంగోలు ఆధ్వర్యంలో 2013 ఫిబ్రవరి 8,9,10 తేదీలలో ఒంగోలులోని టి.టి.డి. కళ్యాణ మండపంలో 7వ రాష్ట్రస్థాయి రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు బి. హనుమారెడ్డి, (సెల్ నం. 9440288080) తెలిపారు. 8వ తేదీ సాయంత్రం 3 గం||లకుప్రారంభ సభ, గజల్ శ్రీనివాస్ సంగీత విభావరి, 9వ తేదీ ఉదయం 10 గం||లకు మొదటి సాహిత్యసభ, సాయంత్రం 3 గం||ల నుండి రెండవ సాహిత్య సభ, 10వ తేదీ ఉదయం 10 గం||లకు కవిత, కథ, విమర్శ, గజల్ ప్రక్రియలపై సాహిత్య శిక్షణా శిబిరము, సాయంత్రం 4 గం||లకు ముగింపు సభ జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభలలో కేంద్రమంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, అధికార భాషా సంఘాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎల్లూరి శివారెడ్డి, లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు డా|| జయప్రకాష్ నారాయణ్, రాష్ట్రంలోని కవులు, రచయితలు పాలొంటారని తెలిపారు. ప్రతినిధులందరూ కవి సమ్మేళనాలలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. ముగింపు సభలో ప్రతినిధులను జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సత్కరిస్తామని తెలిపారు. ఈ మహాసభలలో పాల్గొనే కవులు, రచయితలకు మూడు రోజులపాటు భోజన సౌకర్యం, సాధారణ వసతి కల్పిస్తామన్నారు. ప్రతినిధులుగా పాల్గొనదలచినవారు రూ.50/-లు చెల్లించవలసినదిగా తెలిపారు. పూర్తి వివరాలకు పొన్నూరు వేంకట శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి (సెల్ నంబర్లు 9440432939, 9666693077), ఇంటి నం. 33-1-5, తిరువెంగళం పిళ్ళై వారి వీధి, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అను చిరునామాకు తెలుపవలసినదిగా కోరారు.