'పద్య, గేయ, నాటక రచనలకు ఆహ్వానం




    సి.పి. బ్రౌన్‌ సేవా సమితి ఆధ్వర్యంలో పద్యాలు, గేయాలు, నాటక రచనలకు సంబంధించిన పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఇడమకంటి లక్ష్మీరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం రూ. 54000 బహుమతులు అందివ్వనున్నట్లు తెలిపారు. రచయిత (త్రి)లు ఈ దిగువ సూచనలు పాటించవలసిందిగా కోరారు.

1.    పద్య విభాగం నందు పది పద్యాలు తప్పక మాతృభాష మీద వ్రాయాలి.

2.    గేయ విభాగం నుండి 40 పంక్తులకు తగ్గకుండా మాతృభాష మీద గేయ రచన సాగాలి.

3.    నాటక విభాగం నుండి కనీసం ఒక గంట ప్రదర్శనకు నోచుకొనే విధంగా నాటకం మొత్తం మాతృభాష మీదనే గావించాలి.

4.    ప్రతి విభాగం నుండి ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు ఇవ్వబడును.

నగదు బహుమతులు : ప్రథమ రూ. 10,000/-, ద్వితీయ రూ. 5000/-, తృతీయ రూ. 3000/-

షరతులు :

1.    భాషాభిమానాన్ని ప్రతి ఒక్కరిలో పెంపొందించే విధంగా రచనలు సాగాలి.

2.    ఈ రచన ఇతర పత్రికలు, పుస్తకాలు, బ్లాగులు, వెబ్‌సైట్లలో కాని మరి ఏ ఇతర రూపంలో కాని ప్రచురితం కాలేదని, పరిశీలనలోను లేదు అని హామి పత్రం జత పరచాలి.

3.    ప్రతి రచనకు హామీ పత్రాన్ని జత చేయాలి. అసలుతో పాటు ఒక నకలు ప్రతితో వచ్చిన రచనలు మాత్రమే స్వీకరించబడును.

4.    రచనలు పూర్తిగా అచ్చు ప్రతిలో వుండవలెను. (డి.టి.పి./ టైప్‌)

5.    రచయిత పూర్తి వివరాలు రంగుల చిత్రాన్ని (ఫొటో) తప్పనిసరిగా జోడించాలి. చెరవాణి (ఫోన్‌) సంఖ్య విధిగా వుండాలి.

6.    ఎంపిక కాని రచనలు తిప్పి పంపడం సాధ్యంకాదు.

7.    మీరు పంపించిన రచనలకు సంబంధించిన ఎంపిక విషయమై తుదినిర్ణయం పూర్తిగా న్యాయ నిర్ణేతల బృందానిదే. ఇందులో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు, అనవసర వాగ్వివాదాలకు తావు లేదు.

8.    మిగతా వివరాలకు సమితి వారి అంతర్జాలము (వెబ్‌ సైట్‌) గీగీగీ.బీచీలీజీళిగీదీ.ళిజీవీ ద్వారా తెలుసుకొనవచ్చును.

9.    రచన ప్రతుల మీద మీ పేరు కాని మీ గురించి కాని వ్రాయరాదు. హామీ పత్రంపైన మాత్రమే వ్రాయాలి.

10.    ఒకరు అన్ని విభాగాలలోను పోటీకి పాల్గొనవచ్చు. ఒక్కొక్క విభాగం నుండి ఒక్కొక్కరచనను మాత్రమే పంపించవలెను.

11.    ఎంపిక కాబడిన రచనల సర్వహక్కులు (కాపీరైట్‌) సి.పి. బ్రౌన్‌ సేవా సమితి వారికే చెందును. మరియు సమితి వారు బహుమతి పొందిన రచనలతో పాటు, బహుమతి పొందని రచనలను కూడా పుస్తక రూపంలో తీసుకురావుటకు సమితి వారికి సర్వహక్కులు ఉన్నవి.

12.    వ్యక్తులు, ప్రాంతాలపై కాక రచనలు పూర్తిగా మాతృభాష పరిరక్షణే ధ్యేయంగా వుండాలి.

ళీబిరిజి : బీచీలీజీళిగీదీరీలిఖీబిరీబిళీరిశినీరిటగిబినీళిళి.బీళిళీ

గీగీగీ.బీచీలీజీళిగీదీ.ళిజీవీ

రచనలు చేరవలసిన ఆఖరు తేది : 09-02-2013