శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం - 2013 (పరిశోధనం)
శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం-2013 ను ఈ సంవత్సరం మళ్ళీ పరిశోధన గ్రంథానికి అందివ్వనున్నట్లు డా|| కొలకలూరి ఆశాజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. గడచిన మూడు సంవత్సరాలలో అంటే జనవరి 2010 నుంచి డిసెంబర్ 2012 వరకు ముద్రితమైన పరిశోధన గ్రంథాలు పురస్కారానికి పరిశీలిస్తామని తెలిపారు. ఇందుకోసం రచయితలు గానీ, ప్రచురణకర్తలు గానీ మూడేసి ప్రతులు పంపవలసిందిగా కోరారు. పురస్కారం రచయితకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, ఒక్క రచయితవే ఎన్ని రచనలయినా పురస్కారానికి పరిశీలింపబడతాయని తెలియజేశారు. పురస్కారంగా రూ. 10,000/- నగదు, శాలువ, మొమెంటో ప్రదానం చేస్తారు. పరిశోధన గ్రంథాలు జనవరి 20 లోగా పంపించాలి. ఫిబ్రవరి 20 లోగా పురస్కార ప్రకటనం జరుగుతుందని, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జరిగే సభలో పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. పరిశోధన గ్రంథాలు పంపవలసిన చిరునామా : డా. కొలకలూరి ఆశాజ్యోతి, తెలుగు శాఖాధ్యక్షురాలు, బెంగళూరు విశ్వవిద్యాలయం, జ్ఞానభారతి, బెంగళూరు - 560056
శ్రీమతి కొలకలూరి భాగీరథీ పురస్కారం - 2013 (విమర్శనం)
పురస్కారం-2013 ను ఈ సంవత్సరం మళ్ళీ విమర్శన గ్రంథానికి అందివ్వనున్నట్లు డా|| కొలకలూరి మధుజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. గడచిన మూడు సంవత్సరాలలో అంటే జనవరి 2010 నుంచి డిసెంబర్ 2012 వరకు ముద్రితమైన విమర్శన గ్రంథం పురస్కారానికి పరిశీలిస్తామని తెలిపారు. ఇందుకోసం రచయితలు గానీ, ప్రచురణకర్తలు గానీ మూడేసి ప్రతులు పంపవలసిందిగా కోరారు. పురస్కారం రచయితకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, ఒక్క రచయితవే ఎన్ని రచనలయినా పురస్కారానికి పరిశీలింపబడతాయని తెలియజేశారు. పురస్కారంగా రూ. 10,000/- నగదు, శాలువ, మొమెంటో ప్రదానం చేస్తారు. పరిశోధన గ్రంథాలు జనవరి 20 లోగా పంపించాలి. ఫిబ్రవరి 20 లోగా పురస్కార ప్రకటనం జరుగుతుందని, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జరిగే సభలో పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. విమర్శన గ్రంథాలు పంపవలసిన చిరునామా : ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, తెలుగు శాఖాధ్యక్షురాలు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి నగర్, తిరుపతి - 517502