తెలుగులో సైన్స్ ఫిక్షన్ కథల సంకలనం వేసే ప్రయత్నంలో భాగంగా 30 కి పైగా కథలను సేకరించినట్లు డా. నాగసూరి వేణుగోపాల్, డా. నామిని సుధాకర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 1927 నుండి నేటి దాకా వెలువడిన వాటిలో నుండి కథలు ఎంపికచేశామని తెలిపారు. అయితే వారిలో కొందరి రచయితలు లేదా వారి వారసుల చిరునామాలు లభించలేదని వారి వివరాలు తెలిసిన వారిని తమకు తెలుపవలసిందిగా కోరారు. ఆ కథలు - 1. ఎస్.వి.ఎస్. రావు - గుడ్ ఓల్డ్ వరల్డ్ (తెలుగు భాషాపత్రిక, ఏప్రిల్ 1972) 2. సి. రామచంద్రరావు - నెగటివ్ గ్యాలక్సి (తెలుగు భాషాపత్రిక అక్టోబర్ 1972) 3. మహమ్మద్ ఫిరోజయా- సూక్ష్మజీవులు (తెలుగు భాషాపత్రిక, ఏప్రిల్ 1973) 4. వేమూరి- బ్రహ్మాండం బద్ధలయ్యింది, తెలుగు భాషాపత్రిక, అక్టోబర్ 1973) 5. యం. హేమలత - కన్నతల్లి (ఆంధ్రసచిత్ర వారపత్రిక, మే 4, 1979) 6. పిల్లలమర్రి రామలక్ష్మి - జెనెసిస్ (ఆంధ్రప్రభ దినపత్రిక, ఏప్రిల్ 27, 1983) 7. శంఖవరం సరోజా సింధూరి - వరదగుడి (ఆంధ్రప్రభ దినపత్రిక, మే 4, 1983 8. యం. అన్నపూర్ణా రెడ్డి - నూట పద్నాలుగు (జగతి మాసపత్రిక, ఏప్రిల్ 1987) 9. వక్కలంక వెంకటరమణ - పున్నమినాటికి మళ్ళీ వస్తా (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక డిసెంబర్ 30, 1993) 10. ఊడిగ మధుమారి- మనసున్న మనిషి కథ (ఆంధ్రజ్యోతి వారపత్రిక, మే, 12, 1995) 11. రావేటి రామకృష్ణారావు - మరో ప్రపంచం (ఆంధ్రభూమి మాసపత్రిక, డిసెంబర్ 1991.