హాస్య నాటికలకు పురస్కారం

          ద్వా.నా.శాస్త్రి 66వ జన్మదినోత్సవం సందర్భంగా కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ వారు జూన్‌ 15న హైదరాబాద్‌లో త్యాగరాయగానసభలో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ముద్దాళి రఘురామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ''ద్వా.నా-కిన్నెర' పురస్కారాన్ని సరికొత్త హాస్యనాటికలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉత్తమ హాస్యనాటికకు ఐదువేలు, ద్వితీయ ఉత్తమ హాస్యనాటికకు మూడువేలు అందజేస్తామని తెలిపారు. ప్రదర్శన సమయం 45ని||లకు మించకుండా, అసభ్యత లేకుండా ఉండాలని కోరారు. నాటికలను శ్రీమతి డి. దుర్గ, 1-1-428, గాంధీనగర్‌, హైదరాబాద్‌ - 500 080 చిరునామాకు మే 15లోపు పంపించవలసిందిగా కోరారు.