కొండేపూడి నిర్మలకు ఉమ్మడిశెట్టి సాహితీ రజతోత్సవ పురస్కారం

          ఉమ్మడిశెట్టి సాహిత్య రజతోత్సవ పురస్కారం - 2012 కోసం ప్రముఖ స్త్రీవాద కవయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారి 'నివురు' కవిత్వం ఎంపికైందని అవార్డు వ్యవస్థాపకులు డా|| రాధేయ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ అవార్డు న్యాయనిర్ణేతలుగా డా|| కె. రామమోహనరాయ్‌, డా|| మేడిపల్లి రవికుమార్‌, డా|| బన్న అయిలయ్య గార్లు వ్యవహరించారని తెలిపారు. ఈ రజతోత్సవ పురస్కారసభ జూలై నెలలో అనంతపురం జరుగుతుందని డా|| రాధేయ తెలియజేశారు.