అనంతపురం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో జనవిజ్ఞానవేదిక కార్యాలయంలో మార్చి 23న విద్యుత్ భారాలపై జనకవనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ కవి సూర్యసాగర్ పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సహజ వనరులైన బొగ్గు, నీటిని బహుళజాతి సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహిస్తే ప్రజలపై భారం పడకుండా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షులు తగరం క్రిష్ణయ్య అధ్యక్షత వహించారు. సాహితీస్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు పి. కుమారస్వామి, మాజీ కార్పోరేటర్ డా. ప్రసూన తదితరులు సభలో మాట్లాడారు. ఆకుల రఘురామయ్య, మిద్దెమురళీకృష్ణ, మధురశ్రీ, షేక్ రియాజ్ అహ్మద్, జూటూరి షరీఫ్; సురేష్; జాగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, భాస్కర వరలక్ష్మి, వై. సూర్యనారాయణ రెడ్డి, రామలింగారెడ్డి, వెంకటేష్ తదితరులు జనకవనంలో పాల్గొని విద్యుత్ భారాలను నిరసిస్తూ స్వీయ కవితలు చదివి వినిపించారు.