కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగ కార్యవర్గం ఎంపిక

    కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎంపిక చేసినట్లు మండలి సంచాలకులు, అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌ గోపి తెలిపారు. తనతో పాటు ప్రముఖ సాహితీ వేత్తలు డాక్టర్‌ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్‌ సి. మృణాళిని అకాడమీ సర్వ సభ్య మండలి సభ్యులుగా నియమితులయ్యారన్నారు. శీలా వీర్రాజు, డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌, ఓల్గా, డాక్టర్‌ ఎండ్లూరి సుధాకర్‌, వెలగా వెంకటప్పయ్య, దేవిప్రియ, రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు తెలుగు సలహా మండలి సభ్యులుగా ఎంపికయ్యారని పేర్కొన్నారు. వీరంతా అయిదేళ్ళ పాటు పదవిలో కొనసాగనున్నారు.