శ్రీమతి కుర్రా కోటిసూర్యమ్మ స్మారక సాహితీ అవార్డు ఫౌండేషన్ కమిటీ సాహితీ పురస్కారం 2013కు ప్రముఖ విమర్శకుడు ఆచార్య వెలమల సిమ్మన్నను ఎంపిక చేసినట్లు ఆ సంస్థ అధ్యక్షులు కుర్రా ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, వ్యాకరణం, భాషా చరిత్ర, భాషా శాస్త్రం, సాహిత్య విమర్శ వంటి పలు అంశాలలో రచనలు చేసిన సిమ్మన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యలో తెలుగుశాఖ ఆచార్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ అవార్డును శ్రీకృష్ణదేవరాయ సాహిత్యసాంస్కృతిక సేవాసమితి ఆధ్వర్యంలో ఒంగోలులో అందజేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.