విజయనగరం జిల్లా గజపతినగరంలో గజపతినగరం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయంలో ఏప్రిల్9న ఉగాది కవిసమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా చీకటి దివాకర్ మాట్లాడుతూ ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలుకుతున్నందున గడచిన సంవత్సరంలోని అంశాలు నెమరువేసుకుంటూ పొరపాట్లు జరగకుండా కొత్తసంవత్సరంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆధునిక కాలానికి అనుగుణంగా సమాజాన్ని చైతన్యపరిచే రచనలు చేయాలన్నారు. కార్యక్రమాన్ని కొల్లూరు పద్మజ, పాయల మురళి, పి. రమణమూర్తి నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కవులు, గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.