స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్‌

  భారతరత్న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 123వ జయంతి సందర్భంగా సాహితీ స్రవంతి అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 14న ఘనంగా నిర్వహించారు. జిల్లా శాఖ అధ్యక్షుడు పిల్లి కుమార్‌ స్వామి మాట్లాడుతూ అంబేద్కర్‌ అనుకున్నట్లుగా కులరహిత సమాజం కోసం కలాలతో నిరూపించాలని పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి తగరం కృష్ణయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత మంచి రచయిత అని భారతదేశంలో కులాలు : వాటి ఏర్పాటు, పుట్టుక మరియు అభివృద్ధిపై ఎన్నో వ్యాసాలు రచించారని తెలియచేశారు. అనంతరం జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి సాహితీ స్రవంతి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవులు తమతమ కవితలు విన్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రిస్వామి, సహాయ కార్యదర్శి ఆకుల రఘురామయ్య, కమిటీ సభ్యులు డా|| జెన్నే ఆనందకుమార్‌, డా|| సి. శివన్న డా|| జుటూర్‌ షరీఫ్‌, షేక్‌ రియాజుద్దీన్‌ అహ్మద్‌, వెంకటేశ్‌, బి.కె. నారాయణ, ఆలీఖాన్‌ హూన్నురప్ప, తిరుపాల్‌ నాయక్‌ శేక్నావాలి తదితరులు పాల్గొన్నారు.

సవరణ
సాహిత్యప్రస్థానం ఏప్రిల్‌ 2013 సంచిక ముఖచిత్రంపై శ్రీపాద పినాకపాణి ఫొటోకు బదులుగా వేరే ఫొటో వచ్చింది. అదే సంచిక లోపల నివాళి శీర్షికలో ఉన్న శ్రీపాద పినాకపాణి  ఫొటోను అసలు ఫొటోగా  పాఠకులు గమనించగలరు. పొరబాటుకు చింతిస్తున్నాం.