ఉగాది జనకవనం

    ugaadi-janakavanamసాహితీ స్రవంతి కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 10న స్థానిక కార్మిక కర్షక భవన్‌లో ఉగాది సందర్భంగా విద్యుత్‌ కోతలు, సమకాలీన సంగతులపై ఉగాది కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు పాల్గొన్నారు. సభాధ్యక్షులుగా సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగార మోహన్‌ వ్యవహరించగా కవి సమ్మేళనంలో జిల్లా వ్యాప్తంగా 21 మంది కవులు తమ కవితలు వినిపించారు. ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ సాహిత్యం సమాజంలో ప్రజల్నిచైతన్య పరిచే బలమైన ఆయుధమన్నారు. సామాజిక స్పృహతో కవిత్వం ప్రజలకు దగ్గరవ్వాలని ఈ బాటలో కవులు, నడవాల్సి వుందన్నారు. సాహిత్య ప్రయోజనం విశ్వజనీనమైందని అన్నారు. సమకాలీన సంగతులను బాగా ఆకళింపు చేసుకొని కవిత్వీకరించి ప్రజలను జాగృతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి సహాయ కార్యదర్శి పులిచేరి మహేష్‌, బి.డి. సుధీర్‌ రాజు నాయకులు నాగమణి, డా|| బడేసాహెబ్‌, నరసింహ తదితరులు పాల్గొన్నారు.