జూన్‌ 1న కాకినాడ, సాహితీ స్రవంతి

ఆధ్వర్యంలో అడపా రామకృష్ణ రాసిన 'అడపా రామకృష్ణ కథలు' కథా సంపుటి పరిచయ సభ జరిగింది. వి.ఎస్‌.ఆర్‌ సోమయాజులు, కథల్ని విశ్లేషిస్తూ ప్రసంగించారు. రామకృష్ణ కథలలో సమకాలీన అన్యాయాలు, మానవత ప్రబోధమూ, నిండి ఉన్నై అని సోదాహరణగా చెప్పారు. ఈ మధ్యనే 'సప్తతి' పూర్తి చేసుకున్న కవి, విమర్శకులు జి. సుబ్బారావుకి, ఈ సందర్భంగా అద్దేపల్లి పౌండేషన్‌ తరుపున కలనాథభట్ట వెంకటరామశాస్త్రి ఘన సత్కారం చేశారు. భిలాయి నుండి వచ్చిన ప్రముఖ విమర్శకులు గూడ శ్రీరాములు 'విమర్శలోని సృజనాత్మకత' గూర్చి ప్రసంగించారు. తర్వాత 'రైల్వేస్టేషన్‌' అనే అంశంపై కవి సమ్మేళనం జరిగింది. ప్రభు, రామకృష్ణ శ్రీవత్స, జి. సుబ్బారావు గరికిపాటి మాస్టారు, శ్రీహస్త, కాలనాథభట్ట, అడపా, మొదలైనవారు కవితలు చదివారు. గ.నా.రా. వందన సమర్పణతో సభ ముగిసింది. సభకు అద్దేపల్లి అధ్యక్షత వహించారు.