జూన్ 6వ తేది శ్రీ త్యాగరాయగానసభ హైదరాబాద్‌లో జీ.వి.ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ నిర్వహించిన 11వ వార్షికోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధి సమాచార శాఖ కమీషనర్ పి. విజయబాబు ద్వారా జీవిత సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న డా|| ద్వానా శాస్త్రి (సాహిత్యం) గుదిబండ వెంకటరెడ్డి, సి. రామకృష్ణ డా|| మంగళగిరి ప్రమీలాదేవి, పి. జయప్రకాష్ రెడ్డి తదితరులు
మే 12వ తేది కవితా వికాస వేదిక, లెర్ఫ్, మానస ఆర్ట్ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో డా|| ఎం.బి.డి శ్యామల రచించిన ''సజీవక్షణాలకోసం'' గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రసిద్ధ కవి కె. శివారెడ్డి చిత్రంలో రఘుశ్రీ, మాణికాలరావు, ఆచార్య ఎన్.గోపి, డా|| శ్యామల, బిక్కి కృష్ణ, బైసదేవదాసు వున్నారు.
మే 28న హైదరాబాద్‌లో త్యాగరాయ గానసభలో సాహితీ కిరణం మాసపత్రిక చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా డా|| పట్టాభి కళాపీఠం సౌజన్యంతో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కవితల పోటీలో గెలుపొందిన ద్వితీయ బహుమతిని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా|| రావూరి భరద్వాజ ద్వారా అందుకుంటున్న రచయిత ఎస్. ఎం. సుభాని. చిత్రంలో గుదిబండి వెంకటరెడ్డి, డా|| పోతుకూచి సాంబశివరావు, పట్టాభి కళాపీఠం అధ్యకక్షులు తూములూరి రాజేంద్రప్రసాద్, కార్తీక్ డెవలపర్స్ ఎం.డి. వి.వి. రాఘవరెడ్డి పొత్తూరి సుబ్బారావు ఉన్నారు.
హైదరాబాద్‌లో త్యాగరాయగాన సభలో జూన్ 1వ తేది 2013 కళాసుబ్బారావు కళావేదికలో గిరిరాజు విజయలక్ష్మి సేవాపురస్కారం ప్రదానం. ఎడమ నుండి డా|| కళా వెంకటదీక్షితులు ప్రవీణ్‌కుమార్, చిత్రకారుడు శక్తిదాస్, డా|| సి. నారాయణరెడ్డి, డా|| కమలా ప్రసాదరావు, గిరిరాజు విజయలక్ష్మి, బింగి నరేంద్రగౌడ్ తదితరులు.
మే 26న విజయవాడలో, చండ్రరాజేశ్వరరావు స్మారక గ్రంథాలయంలో, మానస సాహిత్య సాంస్కృతిక అకాడమి ఆధ్వర్యాన కవి రమణ వెలమకన్నిని ప్రతిభా సాహిత్య పురస్కారంతో సత్కరిస్తున్న ప్రముఖ రంగస్థలనటులు, కవి కర్నాటిలక్ష్మీ నరసయ్య, మాజీ శాసన సభ్యులు షేక్ నాజర్‌వలి. చిత్రంలో శ్రీయుతులు. లింగాల రామతీర్థ, అకాడమి అధ్యకక్షులు బ్రహ్మానందరావు మరియు కవి రఘుశ్రీ ఉన్నారు.
మే 28న హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభ కళా వేంకట సుబ్బారావు కళావేదికలో జరిగిన సాహితీ కిరణం చతుర్ధ వార్షికోత్సవం సందర్భంగా డా|| పింగళి జగన్నాధరావు స్మారక పురస్కారం 2013ని డా|| పోతుకూచి సాంబశివరావుకు అందిస్తున్న డా|| రావూరి భరద్వాజ.చిత్రంలో ఆదివిష్ణు, గుదిబండి వెంకటరెడ్డి, పొత్తూరి సుబ్బారావు, తూమూలూరి రాజేంద్రప్రసాద్ ఉన్నారు.