తెలుగు సాహిత్యంలో కథ, గేయం, పాట, పద్యం, సంగీత రూపకం, జీవిత చరిత్రలు తదితర సాహిత్య ప్రక్రియల్లో తన ప్రావీణ్యాన్ని చాటిన సుప్రసిద్ధ రచయిత గిడుగు రాజేశ్వరరావు జులై 21న ఢిల్లీలో కన్నుమూశారు. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వెళ్లేందుకు రైల్వేస్టేషన్ చేరుకున్న ఆయన గుండెపోటుతో ఆకస్మిక మరణానికి గురయ్యారు. 83 ఏళ్ల రాజేశ్వరరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆంధ్ర పండితుల భా