రచయితలకు విజ్ఞప్తి

యు.జి.సి అందించిన ఆర్థిక తోడ్పాటుతో 'ప్రజా వాగ్గేయ సాహిత్యం - పర్యావరణ తత్వం' అనే అంశంపై అధ్యయనం సాగుతున్నది. పర్యావరణ సమస్యలను సంక్షోభాలను, ఇతివృత్తాలుగా చేసుకుని రాసిన మీ గేయసాహిత్యం ఈ ప్రాజెక్టులో భాగంగా అధ్యయనం చేయబడుతుంది. ఇందుకు మీ సహాయం, తోడ్పాటు ఎంతగానో అవసరం. పర్యావరణ స్పృహ, చైతన్యాలతో మీరు రాసిన గేయాలు / పాటలు / తదితర సమాచారాన్ని సేకరించి భద్ర పరచవలసి వుంది. పర్యావరణ విషయంగా మీ సంవేదనలను, అవగాహన, చైతన్య, దృక్పథాలను విశ్లేషించేందుకు వీలుగా మీ గేయాలను పంపవలసిందిగా మనవి. ప్రజావాగ్గేయ కారులుగా మీ కృషిని భావితరాలకు అందించే సంకల్పంతో మీ గురించి సమాచారాన్ని సేకరిస్తున్నాను. మీ బయోడేటాతో పాటుగా, జతపరచిన ప్రశ్నావళికి సానుకూలంగా సమాధానాలు ఇచ్చి తిరిగి ఈ ప్రశ్నావళిని పంపవలసిందిగా మనవి.1. పర్యావరణం గురించి రాయడానికి ప్రేరణ ఏమిటి 2) ఎప్పటి నుండి రాస్తున్నారు? 3) పర్యావరణ విషయంగా తొలిగేయం ఇతివృత్తం.   4) పర్యావరణం గురించి రాసిన గేయాల సంఖ్య. 5) పుస్తక ప్రచురణ జరిగిందా? వివరాలు? 6) మీరు ఇతర వాగ్గేయ కారులతో కలిసి సి.డిలు ప్రకటించారా ? 7) మీ గేయ రచనలకు జానపద బాణీలను ప్రయోగించారా ? వివరాలు 8) వచన కవిత్వ / కవుల ప్రభావం మీ మీద ఏమైనా ఉన్నదా ? 9) మీ గేయ సాహిత్యం గురించిన వ్యాసాలు ఏమైనా వచ్చాయా ? 10) మీ సాహిత్యం గురించి విమర్శనాత్మక విశ్లేషణ జరిగిందని భావిస్తున్నారా ? 11) ప్రదర్శనలు ఇస్తే స్థూలంగా సంఖ్య 12) ప్రదర్శన సందర్భం, రాజకీయ ఉద్యమం, సామాజిక చైతన్యం, ప్రభుత్వ పధకాలకు సంబంధించి, ఇతరం 13) ఏయే ప్రాంతాలలో మీ ప్రదర్శనలు సాగాయి ? 14) అభివృద్ధి, ప్రగతి, సంస్కృతి, నాగరికతల గురించి సందేహాలు మీ గేయాల్లో వ్యక్తం చేశారా? 15) పల్లెల విధ్వంసం - వలసల గురించి రాశారా? వాటి వివరాలు... 16) పట్టణీకరణ గురించి రాసినవి. 17) గేయానికి వస్తువు, దృక్పథాలను ఎట్లా ఎంచుకుంటారు? 18) గ్లోబల్‌ వార్మింగ్‌, జీవవైవిధ్యం, ప్రకృతి వైపరీత్యాల గురించి రాసినవి? 19) ఇతర జీవరాశుల ప్రస్తావన మీ గేయాల్లో పోలికలుగా, ఉపమానాలుగా మోటాఫర్‌గా వాడారా ? 20) ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పర్యావరణ దృష్టికోణంలో అంచనా వేయాల్సి వుందని భావిస్తున్నారా? ఎందుకు? 21) ప్రకృతి విధ్వంసానికి మానవ కార్యకలాపాలే కారణం అనే వాదాన్ని అంగీకరిస్తారా? 22) ప్రకృతిలో భాగంగా సహజీవనం / సమజీవనం పై మీ అభిప్రాయం ? 23) మీ గేయ సాహిత్యం ద్వారా వ్యక్తమైన తాత్వికత ఏమిటి? 24) ప్రకృతి / పర్యావరణ సమస్యలపై పాడిన గేయాలకు ప్రజా స్పందన ఎలా వుంది. 25) స్థానికంగా మిమ్ములను ప్రభావితం చేసిన జానపదగాయకులు లేదా పాటలు 26) పర్యావరణంపై రాసిన అముద్రిత గేయాలు మీ వద్ద ఏమైనా ఉన్నాయా?
    తెలుగు సాహిత్యంలో ప్రజావాగ్గేయకారులుగా ప్రసిద్ధులైన వారు ఈ అంశంపై స్పందించి విలువైన సాహిత్యం సృష్టించిన సంగతి మీకు తెలిసిందే. పర్యావరణ దృష్టికోణం నుంచి సృజించబడిన ఈ వాగ్గేయ సాహిత్యం గురించి అంతగా అధ్యయనాలు జరగలేదు. ప్రకృతి, పర్యావరణం, వనరుల విధ్వంసం, వైపరీత్యాలు, వలసలు పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, జీవవైవిధ్యం ముప్పు, అంతరిస్తున్న జీవరాశులు, మానవ మనుగడకు ఏర్పడుతున్న ఆపద తదితర అనేకాంశాలపై ప్రజా వాగ్గేయకారులు స్పందించారు. వీరు సాహిత్య విషయంగా విశ్లేషణకు మీవంటి ఆలోచనాపరుల, సంవేదనాశీలుర సృజనకారుల ఆలోచనలు, అభిప్రాయాలు, దృక్పథాలు, సూచనలు, సలహాలు అవసరమని భావించి ఒక సంక్షిప్త ప్రశ్నావళిని మీకు పంపుతున్నాను. శ్రమ అనుకోకుండా ఈ ప్రశ్నావళికి సమాధానాలు సకాలంలో ఇచ్చి అధ్యయనానికి తోడ్పాటును ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. 1) ప్రజావాగ్గేయ సాహిత్యంగా మీరు దేనిని పరిగణిస్తారు? 2) మీ దృష్టిలో ప్రజావాగ్గేయ కారులు 3) ప్రకృతి, పర్యావరణ సమస్యలపై ప్రజావాగ్గేయకారులు స్పందించడానికి కారణం? 4) 'మనిషి పర్యావరణ విధ్వంసకుడు' అన్న వాదం గురించి మీ ఆలోచన 5) పర్యావరణ సమస్యలపై వచ్చిన వచన కవిత్వం, కథ, నవలల్లాంటివి మీ దృష్టిలో ఏవి? 6) పర్యావరణ సమతుల్యత సాధించే విషయంలో మీరు సూచించే ప్రత్యామ్నాయం ? 7) తెలుగు సాహిత్యంలో ప్రకృతి, పర్యావరణ చిత్రణ ఇంతకు ముందు జరిగిందా? 8) 1980-90ల మధ్య కాలంలోనే పర్యావరణ స్పృహ చైతన్యాలు పెరగడానికి కారణం? 9) పారిశ్రామిక సమాజాల ఆవిర్భావమే పర్యావరణ విధ్వంస హేతువు అనేవాదం గురించి మీ వ్యాఖ్య? 10) మీ రచనలో పర్యావరణ స్పర్శ గలవి.. 11) తెలుగు సాహిత్యం (ప్రజావాగ్గేయకారులను మినహాయించి) పర్యావరణ, స్పృహ చైతన్యాల దిశగా మరలిన సూచనలు మీ దృష్టికి వచ్చాయా? 12) తెలుగు సాహిత్యాన్ని పర్యావరణ దృష్టి కోణంతో పరిశీలించాల్సిన అవసరం గురించి మీ మాట 13) అభివృద్ధి, ప్రగతి అనే భావనలు మానవాళికి చేసిన మేలు - కీడు ? 14) జూబీళి బీజీరిశిరిబీరిళీ తెలుగులో రూపొందకపోవడానికి కారణాలు? 15) తెలుగులో 'హరితవాద సాహిత్యం' ఒక ప్రత్యేక వాదంగా నిలిచే అవకాశాలు ఈ అంశాలపై సమాచారం ఇవ్వగలరు. ఈ చిరునామాకు సమాచారం అందించగలరు : -డా. ఆర్‌. సీతారామారావు, తెలుగు లెక్చరర్‌, తెలుగు విభాగం,  ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లా - 506101, సెల్‌ : 9866563519.
- ఆర్‌. సీతారామారావు