కవి:
బి. ఇందిర
సెల్ :
7396303552
మనసంతా వసంతమై మురిపిస్తేనె బాగు బాగు
పొగలు - సెగలు ఈ గజలే హరిస్తేనే బాగు బాగు
గుండెలోన చెలిమింగ ఆవిరిగా మారిందా
నీవె భగీరధునిగవతరిస్తేనే బాగు బాగు
మమతలెన్ని పంచితేమి మదిపేదయిపోతుందాదాచుకున్న ఎదబరువే, కురిస్తేనే బాగు బాగు
మానవుడనిపించుకొనగ బతుగ ఒకటె చాలదులే
ప్రేమ అనే వరముతోనే తరిస్తేనే బాగు బాగు
పనికిరాని పగలుబూని శాపగ్రస్తులైన వేళ
నిముషమైన మనుషులమని స్ఫురిస్తేనే బాగు బాగు
రూపు చూసి నరుని జాడ పోల్చలేవు ఓ 'ఇందిర'
మానవతా పతాకాన్నె ధరిస్తేనే బాగు బాగు
ఏమి ఫలము వెదుకులాడ నీడకొరకు ఎడారిలో
హృదయమందె నందనాలు విరిస్తేనే బాగు బాగు
సాహసాలు శ్వాసించే 'నిర్భయ'లకు జోహారులు
అతివ అబల అన్నమాట మరిస్తేనె బాగు బాగు
పిలుపులోనే విజయవైతె ఏమి లాభమో ఉగాది !
పేరు సార్ధక ముగనీవు మెరిస్తేనే బాగు బాగు.