జాషువా 118వ జయంతిని పురస్కరించుకుని తెలుగు అకాడమీ జాషువా పరిశోధనా కేంద్రం తరపున పురస్కారాలకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు సంచాలకులు ఆచార్య కె. యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్ళు పైబడిన వారికి, తెలుగు భాషా సాహిత్య రంగాలలో విశిష్ట కృషిచేసిన ప్రసిద్ధ సాహితీవేత్తలకు జాషువా జీవిత సాఫల్య పురస్కారం, ఏభై ఏళ్ళు పైబడిన వారికి , దళిత సాహిత్యంపైన కృషిచేసిన సుప్రసిద్ధ సాహితీవేత్తలకు జాషువా విశిష్ట పురస్కారం, భాషా, సాహిత్య రంగాలలో విశిష్ట కృషిచేసిన మహిళా సాహితీవేత్తలకు జాషువా విశిష్ట మహిళా పురాస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 28న జరిగే జాషువా జయంతి ఉత్సవాలలో ఈ పురస్కారాలు అందజేస్తారు. వ్యక్తిగత నామినేషన్లు స్వీకరించబడవని, పురస్కార గ్రహీతలకు రెండు లక్షల నగదు, మెమొంటో అందజేయబడుతుందని తెలిపారు. నామినేషన్లను సెప్టెంబరు 7 వ తేదీలోపు చేరాలి. ఇతర వివరాలకు 040-23220244, 9849225677 ద్వారా సంప్రదించవలసిందిగా కోరారు. కో-ఆర్డినేటర్, పద్మభూషణ్ డా. గుర్రం జాషువా పరిశోధన కేంద్రం, కేరాఫ్/సంచాలకులు, తెలుగు అకాడమీ, 3-5-895, హిమయత్‌నగర్, హైదరాబాదు-500 029 చిరునామాకు నామినేషన్లను పంపించవచ్చును.