జమున స్మారక నానీల అవార్డు

సోమిరెడ్డి జమున పేరు మీద నెల్లూరు రచయిత్రి డా|| పెళ్ళకూరు జయప్రద ప్రతి సంవత్సరం ఇస్తున్న సోమిరెడ్డి జమున స్మారక రాష్ట్ర స్థాయి నానీల అవార్డు 2013లో డా|| వై. రామకృష్ణారావు (హైదరాబాద్‌)కు 'మనసు చిత్రాలు' నానీల సంపుటికి లభించింది. ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారానికి కరీంనగర్‌కు చెందిన దాస్యం సేనాధిపతి మాడిశెట్టి గోపాల్‌, అడువాల సుజాత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. 2013 సెప్టెంబర్‌ మూడవ వారంలో జరిగే సభలో వై. రామకృష్ణరావుకు ప్రశంశా పత్రం, మెమొంటోతో పాటు 5 వేల నగదుతో అవార్డు ప్రదానం జరుగుతుందని ఒక ప్రకటనలో యస్‌.వి.యన్‌. రెడ్డి తెలిపారు.