మల్లెతీగ పురస్కారం కోసం కవితలు ఆహ్వానం

'మల్లెతీగ పురస్కారం' పేరుతో కవుల్ని సత్కరించాలని మల్లెతీగ సాహితీ సమాచార వేదిక సంకల్పించింది. ఇందుకు కవుల నుండి కవితలు ఆహ్వానిస్తోంది. ఒక్కో కవి మూడు కవితల వరకు పంపవచ్చు. అయితే ఒక్కో కవిత మూడు కాపీలు పంపాలి. ఒక కాపీ వెనుక మాత్రమే పేరు, చిరునామా, సెల్‌ నెంబరు రాయాలి. మిగతా రెండు కాపీలపై మీ పేరు గాని చిరునామాగానీ రాయకూడదు. కవితతోపాటు మీ ఫొటో తప్పనిసరిగా పంపాలి. కవితలు పంపే కవరుపై 'మల్లెతీగ పురస్కారం కోసం' అని ప్రత్యేకంగా రాయాలి. పురస్కార గ్రహీతలు నవంబరులో విజయవడలో జరిగే పురస్కారం ప్రదానోత్సవ సభకు తప్పక హాజరై తమ పురస్కారాన్ని స్వయంగా అందుకోవాలి అని ప్రకటనలో తెలిపారు. ప్రధాన పురస్కారం రూ. 5000/ల నగదుతో గౌరవ సత్కారం. మరో ఐదుగురికి ఆత్మీయ ఉపరస్కారం రూ. 1000/ల నగదుతో సత్కారం ఉంటుంది. ఆసక్తి గల కవుల తమ కవితల్ని 'కలిమిశ్రీ, మల్లెతీగ సాహితీ సమాచార వేదిక, డోర్‌ నెం. 41-20/3-24, మన్నవవారి వీధి, కృష్ణలంక, విజయవాడ-520013' చిరునామాకు సెప్టెంబరు 30వ తేదీలోగా పంపాలి. మరిన్ని వివరాల కోసం 9246415150 మొబైల్‌లో సంప్రదించవచ్చు.