''మునిమాణిక్యం కథలు - మానవ సంబంధాలు''

    సాహితీ స్రవంతి, కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ''ప్రతినెల - సాహిత్య హేల'' ఆగష్టు నెల కార్యక్రమం గాంధీ భవన్‌లో ఆగష్టు 4న జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి డా. అద్దేపల్లి రామమోహనరావు అధ్యక్షత వహించి, ప్రతినెలా సాహిత్య కార్యక్రమాల నిర్వహణ ద్వారా అనుభవజ్ఞుల నుండి యువ రచయితలకు మార్గదర్శనం, ప్రేమరణ లభించగలవని అన్నారు. ప్రసిద్ధ కధా రచయిత మునిమాణిక్యం నరసింహారావు కథల్లో ''భావ ప్రసార నైపుణ్యాలు - మానవీయ విలువలు'' అనే అంశంపై అవధానుల మణిబాబు సోదాహరణ ప్రసంగం చేస్తూ, కుటుంబ జీవనంలో లభించే రసానుభూతులన్నిటిని హాస్యంతో రంగరించి అంతర్లీనంగా సందేశాన్నందించే అద్భుత కథలుగా అభివర్ణించారు.  అనంతరం 'వానాకాలం' అంశంపై అద్దేపల్లి నిర్వహించిన కవితా గోష్టిలో డా. శిరీష, గరికపాటి సూర్యనారాయణ మూర్తి, అవధాని పోచనపెద్ది, అద్దేపల్లి జ్యోతి, ఇందిర, ఐ.ఎన్‌.మూర్తి, కే.వి.ఆర్‌. శాస్త్రి తదితరులు పాల్గొని తమ కవితలను వినిపించారు. ఈ సభకు గ.నా.రా., ఇబ్రహీంలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సెప్టెంబర్‌ 1న నిర్వహింపబడే తరువాత కార్యక్రమానికి కవితా వస్తువుగా 'గోదావరి'ని నిర్ణయించారు.