కవి:
బమ్మెడి సుబ్బారావు
సెల్ :
9440262515

చీలుస్తున్నాయి
శ్రీకాకుళం చీమలు
మహాప్రస్థానం కోసం
కరచాలనం కాదు
ఖడ్గచాలనం
నేటి రాజకీయం
కపట ఖేలనం
ఏ దివ్య సుందరి
జారవిడిచిన
ధౌతవస్త్రమో
నయాగరా జలపాతం
అతడో
పెంపుడు మేధావి
ఏనాడూ తలూపడు
తోకూపుతాడు
గోరంత దీపం
తలెత్తేసరికి
కొండంత చీకటికి
అంతభయం ఎందుకో !