కవి:
మొదలవలస పద్మావతి
సెల్ :
9492555008

మాటలతో మాయచేసి
ముదితను ఒంటరి చేసి
వికృత వాంఛలతో
విరుచుకుపడి
మల్లెలాంటి మగువను
రక్తపు ముద్దగ మార్చి
నడిరోడ్డున నిర్ధయగా
వివస్త్రగా విసిరేస్తే
మృత్యువుతో పోరాడి
అలసిన ఆ ఆడబిడ్డ
బ్రతకాలని ఉందమ్మా
అని అడిగి అడిగి
అసువులు బాసిన వేళ
భారతమాత గుండెపగిలి
అశృవులతో అర్థిస్తోంది
ఆడపిల్లను ఆటబొమ్మగా
అంగడి వస్తువుగా
మార్చిన విష సంస్కృతిని
విడనాడమని,
సమస్తవనితావని
అల్లాడి అడుగుతోంది
పశుపక్ష్యాదుల నుండి
క్రూరమృగాలకు సైతం
స్వేచ్ఛగా బ్రతికే
హక్కునిచ్చిన దేశంలో
మాకెందుకు స్వేచ్ఛలేదని
సమాన హక్కుల వరకెందుకు
మమ్మల్నిలా బ్రతకనివ్వమని