కవి: 
 హిందీ : ఆశీష్ నైథాని 'సలిల్'
సెల్ : 
వేదుల రామకృష్ణ
 గుమ్మం బయట
గుమ్మం బయట ఉంటుండేవి చక్కగా
ఐదు జతల చెప్పులు
కాలం ఒడిదుడుకులకు
చెల్లా చెదురయ్యారు
కుటుంబ సభ్యులు కూడా
చదువు, ఉద్యోగం, పెళ్ళిళ్ళు
కారణాలు ఎన్నో
ఇప్పుడు ఇంట్లో ఉంటున్నది ఒంటరిగా
ఇద్దరు, ముసలి తల్లి - తండ్రులు
జ్ఞాపకాలన్నిటిని మూట కట్టుకుని 
గుమ్మం బయట మాత్రం
పడి ఉంటాయి
అస్తవ్యస్తంగా
రెండు జతల చెప్పులు