డా. రాధేయ కవితా పురస్కారం 2013ను 'మిథునం చూడని సూర్యోదయం'' అనే కవితను వ్రాసిన మౌనశ్రీ మల్లిక్‌కు అందజేస్తున్నట్లు అవార్డు వ్యవస్థాపకులు దొర్నాదుల సిద్ధార్థ, సుంకర గోపాలయ్య, పెళ్ళూరు సునీల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు ప్రత్యేక పురస్కారాల కోసం ఎం.వి. రామిరెడ్డి, కొత్తపల్లి సురేష్‌లను ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరలో జరగబోయే ఒక కార్యక్రమంలో బహుమతి ప్రధానం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలియజేశారు.