ఆగష్టు 8న గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని అన్నమయ్య కళావేదికపై రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కొణతం నాగేశ్వరరావు స్వరపరచి గానం చేసిన, 6 నుండి 10వ తరగతి విద్యార్ధులకు ఉపాధ్యాయులకు ఉపయుక్తమైన 'తెలుగు పద్య సుధానిధి-2' ఆడియో సి.డి.ని ఆవిష్కరిస్తున్న గుంటూరు డి.ఇ.ఓ. డి. ఆంజనేయులు, కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ యం.యల్.సి కె.యస్. లక్ష్మణరావు ప్రభృతులు. చిత్రంలో (ఎడమ నుండి కుడి) సి.డి. రూపకర్త కొణతం నాగేశ్వరరావు, గుంటూరు డి.ఇ.ఓ. డి. ఆంజనేయులు, యం.యల్.సి.కె.యస్. లక్ష్మణరావు, డా. దేవరపల్లి ప్రభుదాసు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ రచయిత్రి ఎ.వి.కె. సుజాత.