దాట్ల దేవదానం రాజు, మంత్రి కృష్ణమోహన్‌లకు
గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు
గుంటూరు జిల్లా రచయితల సంఘం 2012 సంవత్సరానికి గాను కధ, కవితా ప్రక్రియల్లో పురస్కారాలను ప్రకటించింది. కథ ప్రక్రియలో ''యానాం కథలు'' రాసిన దాట్ల దేవదానం రాజుకు, కవితా ప్రక్రియలో ''ప్రవహించే పాదాలు'' కవితా సంపుటి వెలువరించిన మంత్రి కృష్ణమోహన్‌కు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికకు పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణలున్యాయ నిర్ణేతగా వ్యవహరించినట్లు తెలిపారు.